|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:24 PM
TG: HYDలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో BRSV ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీటింగ్‌ను అడ్డుకోవడం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని గెల్లు మండిపడ్డారు. గ్రూప్-1 అభ్యర్థులకు సంబంధించిన అంశాలపై మీటింగ్ పెడితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.