|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:23 PM
బోరబండ డివిజన్‌లో మాగంటి సునీత గోపీనాథ్ గారి పర్యటన. ఈరోజు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం, బోరబండ డివిజన్ వివిధ కాలనీ లో ప్రజలను, వార్డు సభ్యులను ఆత్మీయంగా కలుసుకున్నారు.ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారితో మమేకమవుతూ ముందుకు సాగుతున్న సునీత గారు రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగర వేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.పార్టీలకతీతంగా స్థానిక ప్రజలు ఆమెను హృదయపూర్వకంగా ఆహ్వానించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.