|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:04 PM
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్‌పిన్ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను ఇప్పటికే పెంచాయి. అంతేకాకుండా సెప్టెంబర్ 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ వర్తించనుంది. ప్రస్తుతం డెలివరీపై జీఎస్టీ 5 శాతం చెల్లిస్తుండగా సెప్టెంబర్ 22 నుంచి అది 18 శాతానికి మారనుంది. అయితే, రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసుకుని అక్కడే తినే ఆహారానికి 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.