|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 06:21 AM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడిన ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.గాయపడిన వారిలో నంద కిశోర్, వీరేంద్ర, ప్రనీష్, అరవింద్, సాగర్, ఝాన్సీ, శ్రుతి ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సౌమ్యారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.