|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 06:16 PM
TG: మరికొద్ది రోజుల్లో వినాయక ఉత్సవాలు మొదలుకానున్న తరుణంలో ప్రకృతిని కాపాడటానికి మట్టి గణపతులనే పూజించాలని HMDA పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వేలాది మట్టి గణపతులను భక్తులకు ఉచితంగా పంచేందుకు సిద్ధం అయింది. HYDలోని దాదాపు 34 కేంద్రాల్లో ఈ మట్టి గణపతులు పంపిణీ పూర్తిగా ఉచితం అని పేర్కొంది. నగరవ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈనెల 24,25,26 తేదీల్లో లక్ష వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.