|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 06:12 PM
TG: ఈనెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రులు పాల్గొని పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.