|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 06:09 PM
TG: రాజకీయాలకు అతీతంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 6 కోట్ల మంది భక్తులు సందర్శించే మేడారం జాతరను గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహిస్తామన్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన జాతరలో రూ.115 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈసారి 2026లో జనవరి 28-31 మధ్య జరగనున్న జాతర కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.