|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 11:27 AM
నిజాంపేట మున్సిపాలిటీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారంలో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 22వ డివిజన్ వాసవి లేఔట్, సర్వేపల్లి రాధాకృష్ణ పార్క్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మున్సిపల్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.