|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 11:05 AM
హైదరాబాద్ వాసులకు త్వరలో మరో పర్యాటక అనుభూతి అందుబాటులోకి రానుంది. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు తరహాలో మూసీ నదిలో కూడా బోటు షికారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళికలో భాగంగా అధికారులు బోటింగ్‌ను ప్రతిపాదించారు. అయితే ముందుగా కృష్ణా, గోదావరి నీటిని మూసీలోకి తరలించి స్వచ్ఛమైన నీటితో నింపాలని భావిస్తున్నారు. బోటింగ్‌కు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.