|
|
by Suryaa Desk | Thu, Aug 21, 2025, 11:15 PM
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూలో వృద్ధి సాధించేందుకు జలమండలిలో కొత్త సంస్కరణలు చేపట్టనున్నట్టు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.జూబ్లీహిల్స్ థీమ్ పార్క్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో వాటర్ బోర్డు రెవెన్యూ మరియు ఐటీ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు.మీటర్ లేని కనెక్షన్లకు బిల్లింగ్ విధించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. అలాగే, రెవెన్యూ సంబంధిత వివాదాలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.బల్క్ కనెక్షన్లకు ప్రత్యేక విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీటర్ రీడింగ్ ఏజెన్సీల నియామకానికి త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్టు తెలిపారు.పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతున్న వారికి వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.