|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:26 PM
పర్యాటకంలో ఖమ్మం జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం వైరా రిజర్వాయర్‌ను సందర్శించి, ఆనకట్ట సమీపంలోని గుట్టలు, బోటింగ్ ప్రాంతాలను పరిశీలించారు. అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఖాళీ ప్రభుత్వ భూమిని, మత్స్య విత్తన క్షేత్రాన్ని తనిఖీ చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.