|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:25 PM
యూరియా సరఫరా విషయంలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. రాష్ట్రానికి ఈ వారంలోనే యూరియా సరఫరా చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా కొరతపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తుమ్మల విమర్శించారు. సవాళ్లు విసరడం కాదు.. సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని తుమ్మల హితవుపలికారు.