|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:24 PM
TG: తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో ఆయన బుధవారం మాట్లాడారు. ‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రెడ్డి, వెలమ పార్టీలు. అందుకే త్వరలోనే బీసీల నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా. మంచిర్యాలలో బీసీ బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బీసీలపై ఈగ వాలినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా’ అని తెలిపారు.