|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:27 PM
చింతకాని మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపి, ఇతర నాయకులు పాల్గొన్నారు.