|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 12:37 PM
వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, డబ్బులు తీసుకుని ఇళ్లు కేటాయించారనే బీజేపీ ఆరోపణలను ఖండించారు. బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అసత్యాలు మాట్లాడుతున్నారని, గత పదేళ్లుగా కేంద్రం పేదల కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే మండల అధ్యక్ష పదవికి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.