|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 12:32 PM
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలో నాణ్యమైన టమాటా ధర కేజీ రూ.60-70 వరకు పలుకుతోంది. హోల్‌సెల్‌గా కేజీ రూ.40-50 వరకు ఉంది. అలాగే ఏపీలోని విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ధర కేజీ రూ.50-60 పలుకుతోంది. ఇక జిల్లాల్లో రూ.35-45 వరకు పలుకుతోంది. అతిభారీ వర్షాలు, వరదలతో టమాటా పంట తీవ్రంగా దెబ్బతినడంతోనే సరఫరా తగ్గి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.