|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 12:07 PM
హైదరాబాద్‌లో కల్తీ దందా బేతాళం అయ్యింది. మొన్న పాలలో, నిన్న నిత్యావసర సరుకుల్లో..ఇప్పుడు వంటలలో విస్తృతంగా ఉపయోగించే ఖరీదైన మిరియాల్లోనూ మోసం వెలుగులోకి వచ్చింది. మిరియాల మధ్య ఎండిన బొప్పాయి గింజలు కలిపి విక్రయిస్తున్న ఘటనలు పలు ప్రాంతాల్లో బయటపడుతున్నాయి. రూపంలో రెండు ఒకేలా కనిపించడంతో, ఇది తెలియక ప్రజలు మోసపోతున్నారు. ఈ కల్తీ వాణిజ్యం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.