|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 12:42 PM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలోని ఏవీబీపురంలో నాలా ఆక్రమణలను హైడ్రా సోమవారం తొలగించింది. పరికి చెరువు నుంచి కూకట్‌పల్లి నాలాలో కలిసిన దీని వెడల్పు 10 మీటర్లు కాగా.. 3 మీటర్లకు పైగా కబ్జాకు గురైంది. ఈ నాలాపైన రెండు షట్టర్లు వెలిశాయి. నాలానే కాకుండా.. మ్యాన్‌హోల్‌పైన కూడా నిర్మాణాలు చేపట్టారు. ఇందులో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయాలు, మరమ్మతులు చేస్తున్నారు. నాలా ఆక్రమణతో సాయిబాబాకాలనీ, హెచ్ ఏ ఎల్ కాలనీ, మైత్రినగర్‌లో వరద ముంచెత్తుతోంది. ఏమాత్రం వర్షం పడిన పై నుంచి వచ్చే వరద సాఫీగా సాగక.. తమ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో జలమండలి అధికారులు కూడా పరిశీలించారు. జలమండలి అధికారుల నివేదిక మేరకు హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.