|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:34 PM
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణం, గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమున్న చోటనే యూరియాను ఇవ్వాలని, అనవసరమైన చోట డంపు చేయవద్దని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు అమ్మిన యూరియా, ఇతర ఎరువుల వివరాలను, స్టాక్ రిజిస్టర్, ఆన్లైన్ లో పరిశీలించారు. రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్నంత మేరకే యూరియాను ఇవ్వాలని సూచించారు.