|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:34 PM
TG: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి KTR బహిరంగ లేఖ రాశారు. 'జీఎస్టీ స్లాబ్ రద్దు/మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుంది. గత పుష్కరకాలంగా రూ.లక్షల కోట్లు పెంచి పెట్రోల్, డీజిల్, LPG రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుంది. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రాథమిక కారణమైన పెట్రో ధరలను తగ్గించాలి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపైన పన్నులు తగ్గించి సెస్సులను ఎత్తివేయాలి' అని పేర్కొన్నారు.