|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 04:02 PM
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల ఆరేపల్లి గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. గణపతి విగ్రహాన్ని సిరిసిల్లకు తీసుకెళ్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి లక్ష్మీనారాయణ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు సాయి (25) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సాయిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు సిరిసిల్లకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.