|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 04:01 PM
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నిర్మల్ తో పాటు ఇతర చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.