|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 04:00 PM
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లాలో పెరుగుతున్న యూరియా కొరత, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఈ చెక్ పోస్ట్ ను ప్రారంభించారు. రైతుల అవసరాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున యూరియాను అందజేస్తున్నా, అక్రమ రవాణా వల్ల కొరత ఏర్పడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకపై సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణాకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.