|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 04:07 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేటలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మల్లంపేట-బాచుపల్లి ప్రధాన రహదారి జలమయమైంది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం అధికారులు స్పందించి, హైడ్రా, ఇరిగేషన్ మరియు మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. మున్సిపల్ మరియు ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయంతో మట్టిని తొలగిస్తూ రహదారిని క్లియర్ చేసే పనులు చేపట్టారు.