|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 11:32 AM
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు 15,643 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల రిజర్వాయర్‌లో 643.35 అడుగుల నీరు చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో, అధికారులు ఎనిమిది క్రస్ట్ గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి, ఇన్‌ఫ్లోకు సమానంగా 15,442 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 140 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నారు.