|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 11:20 AM
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గుర్తించిన పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.