|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 11:14 AM
హైదరాబాద్‌లోని పాతబస్తీ, బాబానగర్‌లో భారీ వర్షం కారణంగా వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కాల్వలో పడింది. కారులో ఉన్న ముగ్గురు యువకులను స్థానిక వాహనదారులు, బాటసారులు అతి కష్టం మీద బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.