|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 02:45 PM
రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ ఇటీవల చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అఘెరీ మంగళవారం బెయిల్‌పై విడుదలైంది. చీటింగ్ కేసులో అఘోరీపై నాలుగు కేసులు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందాయి. దీంతో వారు అఘోరీని విడుదల చేశారు. కాగా జైలు నుంచి వచ్చిన తర్వాత అఘోరీ మీడియాతో మాట్లాడుతూ.. తాను కాశీకి వెళ్తున్నట్లు వెల్లడించింది.