|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:53 PM
HYDలోని ఉప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. రామంతాపూర్ ప్రమాద స్థలానికి విద్యుత్ సీఎండీ చేరుకోవడంతో స్థానికులు అడ్డుకున్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని నిరసన చేశారు. ర్యాలీకి యత్నించిన స్థానికులను పోలీసులు చెదరగొట్టారు. పోలీసులకు, స్థానికులకు వాగ్వాదం జరగటంతో రామంతాపూర్ మెయిన్‌రోడ్‌పై స్థానికులు ధర్నా చేపట్టారు. రామంతాపూర్‌లో శ్రీ కృష్ణ రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.