|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:58 PM
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.90 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 26 గేట్లను ఐదడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 2,52,341 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఔట్ ఫ్లూ 2,45,894 క్యూసెక్కులుగా ఉంది.