|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:11 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. మంగళవారం మధ్యాహ్నానికి ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరందాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కామారెడ్డి, మెదక్, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏపీలోని అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కాకినాడ, తూ.గో, ఏలూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయంది