|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 02:58 PM
మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై పోలీస్ హోంగార్డు ఖాజాకు రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపైకి అకస్మాత్తుగా వచ్చిన కుక్కను తప్పించబోయి, ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయనకు ఎడమ కాలు, తలకు గాయాలయ్యాయి. మునగాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆయనను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.