|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 02:53 PM
భువనగిరి: మొఘల్ సామ్రాజ్యానికి ఎదురీదుతూ, గోల్కొండ కోటను ఏలిన తొలి తెలంగాణ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి ఖిల్లా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.తరువాత నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ,“సమాజ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయుడు. ఆయన పోరాటం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ గారు,మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ వి.హెచ్ హన్మంతు రావు గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ పాశం యాదగిరి గారు ,ఓబిసి జాతీయ నాయకులు శ్రీ కత్తి వెంకటస్వామి గౌడ్ గారు, పాపన్న సేన అధ్యక్షులు శ్రీ పంజాల జైహింద్ గౌడ్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.