|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 02:50 PM
కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ కమాన్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన వీరగాథను స్మరించుకున్నారు.