|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 11:39 AM
దుబ్బాక మండలం హబ్సిపూర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మంతూరి విఠల్ మృతి చెందగా, అతని కుమారుడు చంద్రశేఖర్ గాయపడ్డారు. సిద్దిపేట వైపు నుంచి వస్తున్న కారు వీరి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది, స్థానికుల సహాయంతో గాయపడిన చంద్రశేఖర్‌ను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.