|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 11:29 AM
మరో దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు భార్య ప్లాన్. వరంగల్ నగరంలో చోటు చేసుకున్న ఘటన. రూ.3 లక్షల సుపారీ ఇచ్చి భర్త రాజు హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన గంగరబోయిన పద్మ అనే మహిళ. ఈ నెల 14న ప్రియుడు, మరో ముగ్గురు కలిసి పోతననగర్ డంప్‌యార్డ్ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి రాజుపై హత్యాయత్నం. చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన ప్రియుడు సందీప్, మరో ముగ్గురు. ఆపై ఇంట్లోని రూ.9 లక్షల నగదు తీసుకుని ప్రియునితో పరారైన భార్య. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త రాజు. పరారీలో ఉన్న భార్య పద్మ, ఆమె ప్రియుడు సందీప్‌ను పట్టుకుని రిమాండ్‌కు తరలింపు. రూ.5.40 లక్షల నగదు, స్విఫ్ట్ కారు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు