|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 02:55 PM
భారీ వర్షాలు కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 588.30 అడుగులకు నీరు చేరింది. దీంతో సాగర్ అధికారులు అప్రమత్తమై 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ప్రస్తుతం 2,52,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2,60,344 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.