|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 03:00 PM
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు AEE సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 4.627 టీఎంసీలు మాత్రమేనని చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయకట్టు రైతులకు అధికారులు సూచించారు.