|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 02:53 PM
హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, సోమవారం సాయంత్రం అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్‌నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పది నిమిషాల ప్రయాణానికి గంటల సమయం పట్టింది.