|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 03:02 PM
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి చదువుల ఒత్తిడిని తట్టుకోలేక పాఠశాల నుంచి పారిపోయిన ఓ 12 ఏళ్ల బాలికను బాలానగర్ సీఐ నర్సింహారాజు రక్షించి, ఆమె తల్లికి అప్పగించారు. ఈ సంఘటన శనివారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న సీఐ నర్సింహారాజు ఫుట్‌పాత్‌పై రోదిస్తూ వెళ్తున్న బాలికను గమనించి ఆపారు. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలిక తల్లికి అప్పగించారు.