|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 02:15 PM
కేసీఆర్ హయంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం అబద్ధాలు మాట్లాడారని BRS నేత జగదీశ్ మండిపడ్డారు. 'నిన్న రేషన్ కార్డుల పంపిణీ పేరు మీద తుంగతుర్తిలో ప్రభుత్వ ఖర్చుతో సభకు జనాలను తీసుకొచ్చారు.. అది పూర్తిగా అధికారిక కార్యక్రమం. నేను రేవంత్ స్థాయికి దిగజారను.. సీఎం ఎంత మొత్తుకున్నా సభలో జనం నుంచి స్పందన లేదు. బూతులు తిడితేనైనా స్పందిస్తారని సీఎం బూతులకు తెగబడ్డారు. సీఎంకు సంస్కారం, బుద్ధి పెరగలేదు' అని విమర్శించారు.