|
|
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 07:44 PM
తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. సన్నవడ్లకు కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించటం, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మూడు నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వంట కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు తగ్గాయి. గతంలో రూ. 5 వేలకు పైగా ఉన్న క్వింటా ధరలు.. ప్రస్తుతం రూ. 4 వేలకు పడిపోయాయి. దీంతో మధ్యతరగతి ప్రజలకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వ్యాపారులు గిరాకీ లేక ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు మార్కెట్లో సన్న బియ్యం ధరలు తగ్గేలా చేశాయి. గతంలో క్వింటా అయిదు వేల నుంచి ఆరువేల మధ్య పలికిన ధరలు ప్రస్తుతం భారీగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర 4000 రూపాయల నుంచి 4500 మధ్య అమ్ముడవుతున్న పరిస్థితి ఉంది. ఇదిలావుంటే , జూన్ నుంచి క్రమంగా బియ్యం ధఱలు తగ్గుతున్నాయి. జూలై మొదటి వారంలో మరింత పడిపోయాయి. గత ఏడాది క్వింటాల్ రూ.5,600 ఉన్న హెచ్ఎంటీ రకం బియ్యం ధర ఇప్పుడు రూ.4,600కు తగ్గింది. కర్నూల్ మసూరి రకం రూ.4,000కు చేరుకోగా, జై శ్రీరాం రకం రూ.5,800 నుంచి రూ.4,600కు పడిపోయింది. ఆర్ఎన్ఆర్, సాంబా రకాల ధరలు కూడా క్వింటాల్ రూ.1,000 వరకు తగ్గాయి. ఇక సన్నబియ్యం ధరలు బాగా తగ్గడానికి సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సన్నరకం వడ్లపైన 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో సన్నబియ్యం సాగు చేసిన వారి సంఖ్య బాగా పెరిగింది. సన్నబియ్యం సాగు విస్తీర్ణం దాదాపుగా గతంతో పోల్చుకుంటే రెట్టింపయింది. ఎక్కువగా సన్న బియ్యం సాగు చేయడం వల్ల పెద్దగా సన్నబియ్యం కొనుగోలు చేస్తున్న దాఖలాలు మార్కెట్లో కనిపించడం లేదు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ కి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో గత కొద్ది నెలలుగా సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ఇక ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని, అదికూడా సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో సన్న బియ్యం కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత తగ్గింది. ఫలితంగా మార్కెట్లో ధరలు బాగా పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.60 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు 17349 రేషన్ షాపుల ద్వారా మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంతో, ఈ భారీ పంపిణీతో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం డిమాండ్ బాగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలోని సన్నబియ్యం వాడకం తగ్గింది అంటే, గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న డిమాండ్ కూడా ప్రస్తుతం పడిపోయింది.వదిలిపెట్టేది లేదు. తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి సన్నబియ్యం ఆర్డర్లు తెలంగాణ రాష్ట్రానికి బాగా తగ్గడం వల్ల కూడా సన్న బియ్యం ధరలు పడిపోయాయి. జూన్ నుంచి క్రమంగా బియ్యం ధర తగ్గుతున్న పరిస్థితి ఉంది .ఇక సన్న బియ్యం ధరలు మార్కెట్లో తగ్గడం సామాన్య మధ్య తరగతి ప్రజలకు కాస్త రిలీఫ్ ని ఇస్తున్నాయి.