![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:25 PM
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 33, 50 లక్షల నిధులతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణాలకు సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుంది అన్నారు.