![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:26 PM
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు రోజులో చాలాసార్లు కొనసాగుతుంది. అయితే, వీటిలో ఉండే కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెఫీన్ లేని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా 'గులాబీ టీ' (రోజ్ టీ) మంచి ఎంపిక అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఎండబెట్టిన గులాబీ రేకులతో తయారుచేసే ఈ టీని రోజుకు రెండు కప్పులు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు.ఎండబెట్టిన గులాబీ రేకులతో చేసే ఈ టీలో పాలీఫినాల్స్, ఆంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే రోజ్ టీ సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలోనూ ఇది సహాయపడుతుంది అని నిపుణులు తెలుపుతున్నారు.