![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 01:00 PM
పురుగుమందు తాగి రైల్వే ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రైల్వే ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఎస్సై రాణాప్రతాప్ వేధింపుల కారణంగానే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.