![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 11:33 AM
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది కార్మికులను వెంటనే అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారుప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటన జరిగిన ఆ ప్రాంతంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సివుంది. మార్నింగ్ షిప్ట్‌కు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఘటన గురించి తెలియగానే ఆ కంపెనీ ప్రతినిధులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు.