![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 11:30 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో.. ఏటీఎం మిషన్ వద్ద ఫోన్లో మాట్లాడుతూ డబ్బులు డ్రా చేస్తున్న ఓ యువకుడిని ఏమార్చి అతడి డెబిట్ కార్డును అపహరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. సూర్యతేజ అనే యువకుడు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఫోన్లో మాట్లాడుతూ లావాదేవీ చేస్తుండగా.. అదే సమయంలో ఇద్దరు దుండగులు ఏటీఎంలోకి వచ్చి, సాయం చేస్తున్నట్లుగా నటించి చెల్లుబాటు కాని కార్డును అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయిన దుండగులు. అనంతరం మరో ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న దుండగులు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు