![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 11:03 AM
టీవీ యాంకర్, ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి, వక్త అయిన స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య హత్యపై మీద అనేక మంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంతో ధైర్య వంతురాలు.. ఆమె ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? అంటూ తోటి జర్నలిస్టులు, ఆమె మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్ వంటి వారు కూడా సంతాపాన్ని ప్రకటించారు.కాగా స్వేచ్ఛ ఆత్మహత్యకి కుటుంబకలహాలే కారణం అని తెలుస్తోంది. స్వేచ్ఛ తండ్రి తాజాగా తన కూతురి ఆత్మహత్య ఘటనపై స్పందించారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి కారణం పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత కొన్ని రోజులు వారిద్దరూ కలిసే ఉంటున్నారని తెలిపారు. ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారని ఆయన అన్నారు. పెళ్లికి మాత్రం నిరాకరించాడని, ఆ విషయంలోనే తన కూతురు మనస్థాపం చెంది ఉంటుందని ఆయన అన్నారు.