![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 12:16 PM
ఆత్మకూరు మండలం తుక్కపురం పోసానికుంట గ్రామంలో మాజీ మదర్ డైరీ డైరెక్టర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,సామ సుధాకర్ రెడ్డి గారు విద్యుత్ షాక్ తో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు బుధవారం రోజు తన కుటుంబాన్ని పరామర్శించారు.విద్యుత్ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు.ఈ సందర్భంగా సామ సుధాకర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.