![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:07 PM
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర నూతన మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వివేక్ ను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు సజ్జాత్, బండారి సునీల్, గంగుల సంతోష్, కోల అనిల్, నల్గొండ కుమార్ ఉన్నారు.